మహబూబ్‌నగర్‌లో కుండపోత వర్షం.. అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

-

తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే కొన్ని జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. భారీ వర్షాల ప్రభావం వల్ల మహబూబ్ నగర్ లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం మహబూబ్‌నగర్‌లో సుమారు మూడు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. కాగా, సమాచారం తెలిసిన వెంటనే మంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. 36వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుజరాత్ లోని అహ్మదాబాద్ వెళ్లిన రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్… అక్కడి నుంచే పరిస్థితిని సమీక్షించారు.

Gang planning to kill Telangana Minister Srinivas Goud nabbed

లోతట్టు ప్రాంతాలైన రామయ్య బౌలి, బికే రెడ్డి కాలనీ, వల్లబ్ నగర్, శివశక్తి నగర్ తదితర ప్రాంతాల్లో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్, అగ్నిమాపక, మున్సిపల్, పోలీస్ సిబ్బంది మంత్రి ఆదేశాలతో హుటాహుటిన లోతట్టు ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఒక్కసారిగా 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం వల్లే ఎగువ నుంచి భారీగా వర్షపు నీరు వచ్చిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సిబ్బంది నిరంతరం లోతట్టు ప్రాంతాల కాలనీ ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి సమస్య లేకుండా చూడాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news