హైదరాబాద్ మహానగరంలో సదరు వేడుకలు అంబరాన్ని అంటాయి. హైదరాబాద్ మహానగరానికి… తలమానికమైన సదరు సంబరాలు ఈసారి కూడా హైలైట్ గా నిలిచాయి. అయితే ఖైరతాబాద్ సదర్ ఉత్సవాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ఖైరతాబాద్ కూడలిలో సదర్ ఉత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ సదర్ ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో పాల్గొని తిరిగి కారులో వెళ్తుండగా ఓ వ్యక్తి పై నుంచి ఆయన కారు వెళ్లడంతో అతని కాలు కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కుటుంబ సభ్యులు మరియు స్థానికులు సాయి యాదవ్ ను అడ్డుకుని… వాగ్వాదానికి దిగారు. గొడవ తీవ్రం కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని… గాయపడిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సర్ది చెప్పారు. బాధితున్ని పోలీసు వాహనంలో సమీపంలో… ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు పోలీసులు. దీంతో అక్కడి నుంచి మంత్రి తలసాని కుమారుడు వెళ్లి పోయారు.