భోజనం చేసారా..? ఈ తప్పులు చేసే ఉంటారు చూడండి… ఎక్కువ మంది చేసే తప్పులు ఇవే..!

-

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం కూడా సరైనది అయి ఉండాలి. చాలా మంది భోజనం చేసే విషయంలో కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. నిజానికి ఆ తప్పులు వలన ఆరోగ్యం పాడవుతుంది. మధ్యాహ్నం భోజనం చేస్తున్నారా..? భోజనం చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి. ఎందుకంటే చాలా మంది ఈ తప్పుల్ని రోజు చేస్తూ ఉంటారు.

  1. చాలా మంది బయట ఆహారాన్ని తింటూ ఉంటారు ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం సమయంలో లంచ్ బాక్స్ ని తీసుకు వెళ్లకుండా క్యాంటీన్లలో రెస్టారెంట్స్ లో తింటూ ఉంటారు ఇలా తింటే ఆరోగ్యం పాడుతుంది. ఎందుకంటే శుభ్రత తక్కువ ఉంటుంది పైగా పోషక ఆహారం మీరు మిస్ అవుతుంటారు.
  2. అలానే వర్క్ ప్లేస్ లో కూర్చుని చాలా మంది భోజనం చేస్తూ ఉంటారు అక్కడ టాయిలెట్లో కంటే మూడు రెట్లు ఎక్కువ క్రిములు ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఈ తప్పును చేయకండి. తినేటప్పుడు ప్రశాంతంగా ఉన్న చోటనే కూర్చుని తినండి.
  3. ఆలస్యంగా చాలా మంది తింటూ ఉంటారు ఆలస్యంగా భోజనం చేయడం వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. టైం టు టైం ఆహార పదార్థాలని తీసుకుంటూ ఉండాలి ఆలస్యం గా తినకండి.
  4. వండిన ఆహారం పైన చాలామంది ఎక్కువ ఆలివ్ ఆయిల్ వేసుకోవడం లేదంటే స్పైస్ కోసం పేపర్ వంటివి ఎక్కువగా యాడ్ చేసుకోవడం లాంటివి చేస్తారు ఆ తప్పును కూడా చేయకండి.
  5. భోజనం తిన్న తర్వాత చాలామంది సోడా లేదంటే డ్రింక్స్ వంటివి తీసుకుంటూ ఉంటారు ఇది కూడా పెద్ద తప్పే.
  6. అలానే పోషక పదార్థాలతో నిండిన ఆకుకూరలని కూరగాయల్ని భోజనంలో తీసుకోకుండా చాలామంది తప్పు చేస్తారు. పోషక పదార్థాలు ఎక్కువగా ఉండే వాటిని తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
  7. తిన్న తర్వాత చాలామంది ఎక్కువసేపు కూర్చుంటారు. ఇది కూడా పెద్ద తప్పే. తిన్నాక కాసేపు నడవడం వంటివి చేస్తూ ఉండండి వెంటనే మీరు సిస్టం ముందు కూర్చుంటే ఆరోగ్యం పాడవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news