పెరుగులో ఇది కలిపి రాస్తే ఎలాంటి జుట్టు సమస్య అయినా నయం అవడం ఖాయం

-

జుట్టు రాలడాన్ని తగ్గించాలని చాలా ప్రయత్నాలు చేసి అలిసిపోయారా..? కొంతమందికి జుట్టు రాలిపోతుంది, ఇంకొంతమందికి చివర్లు చిట్లుతుంది, చాలామందికి జుట్టు పలచగా ఉంటుంది.. ఈ సమస్యలన్నింటికి సింగిల్‌ సొల్యూషన్‌ ఉంది తెలుసా..? పెరుగులో ఇది కలిపి రాస్తే మీ జుట్టు సమస్యలన్నీ పోతాయి. ఇప్పటికే ఎన్నో షాంపూలు, ఆయిల్స్‌ వాడి విసిగిపోయి ఉంటారు. ఆఖరి ప్రయత్నంగా ఇది ట్రై చేసి చూడండి. పిక్చర్‌ వేరేలా ఉంటుంది.

అవిసె గింజలు తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను దూరం చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పెరుగులో ప్రోటీన్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. పెరుగు మరియు అవిసె గింజల కలయిక కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించడంలో సహాయపడుతుంది, ఇది జుట్టు మూలాలకు పోషణనిస్తుంది. ఇది జుట్టు రాలడం సమస్యను పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది. ఇది జుట్టు యొక్క మొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుంది. జుట్టు నిర్మాణం, బలాన్ని మెరుగుపరుస్తుంది.

వీటిని కలిపి కూడా తినొచ్చు.. ఎలా అంటే.. ముందుగా అవిసె గింజలను వేయించాలి. ఇప్పుడు మిక్సీలో వేసి పొడిగా చేసుకోండి. ఒక కప్పులో పెరుగు తీసుకుని అందులో ఒక టీస్పూన్ అవిసె గింజల పొడి వేసి తినండి. ఇలా డైలీ తింటే మీ జుట్టు రాలే సమస్య పూర్తిగా నయం అవుతుంది. అయితే ఇదొక్కటే చేస్తే సరిపోదు, సరైన జీవనశైలి, సమతులాహారం, అన్నీ జుట్టు ఆరోగ్యానికి ముఖ్యం. అలాగే హైడ్రేటెడ్‌గా ఉండటం అవసరం.

కనుబొమ్మలు పలుచగా ఉన్నా, తలలో ముందు భాగంలో జుట్టు బాగా ఊడిపోయి స్కల్ కనిపించే వాళ్లు.. అవిసె గింజలను రెండు స్పూన్లు తీసుకుని అరలీటర్‌ నీటిలో వేసి బాగా మరిగించండి. అందులోనే ఒక టీస్పూన్‌ మెంతులు వేయండి. జల్‌లా అవుతుంది. దీన్ని రోజూ రాత్రి ఎక్కడైతే జుట్టు పలుచుగా ఉందో అక్కడ రాయండి, కనుబొమ్మలు దగ్గర కూడా అప్లై చేసి ఉదయం క్లీన్‌ చేసుకోండి. ఈ జల్‌ను వారం పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టి వాడుకోవచ్చు. ఇలా డైలీ చేస్తే.. త్వరలోనే మీకు ఆ ఏరియాలో జుట్టు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version