వినూత్న పథకాలతో… నిర్ణయాలతో తమ మార్క్ చాటుకుంటున్నాడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. డీఎంకే తమిళనాడులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుపరిపాలనకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. రోడ్డు పక్కన నిలుచున్న సామాన్య ప్రజల కోసం తన కాన్వాయ్ ఆపి మరి వారి వినతులను స్వీకరిస్తున్నారు. జనానికి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా… తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. అసెంబ్లీలో క్యాంటీన్ మూసేసి.. ఎమ్మెల్యేలు ఇంటి వద్ద నుంచి భోజనాలు తీసుకురావచ్చని ఆదేశించారు. గతంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను కొనసాగించారు. ప్రతిపక్ష నేతలైన జయలలిత, పళని స్వామి బొమ్మలు ఉన్న స్కూల్ బ్యాగులను పంచేందుకు కూడా వెనకాడలేదు.
తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది స్టాలిన్ ప్రభుత్వం. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలల్లో చదువుకునే బాలికలకు నెలకు రూ. 1000 ఇస్తామని ప్రకటించింది. ఈ పథకం ద్వారా తమిళనాడులో 6 లక్షల మంది విద్యార్థినులు లాభం పొందుతారని పేర్కొంది. తమిళనాడు బడ్జెట్ లో ఆర్థిక మంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్ ఈపథకాన్ని ప్రవేశపెట్టారు.