అధికారం చేతులో ఉంది కదా అని కొందరు దుర్వినయోగానికి పాల్పడుతున్నారు. పెళ్లి పేరుతో ఆశచూపి యువతులను లొంగదీసుకుంటున్నారు. వారి కోరిక తీరాక ముఖం చాటేస్తున్నారు. అలాంటి ఘటనే ఇంది.. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ఎమ్మెల్యే ఆ తర్వాత మోసం చేశారంటూ ఒడిశాకు చెందిన యువతి బీజేడీ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగత్‌సింగ్‌పూర్ జిల్లా తిర్తోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ్‌శంకర్ దాస్, తాను ప్రేమించుకున్నామని సోమాలిక దాస్ అనే యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమ వివాహానికి ఇరు కుటుంబాల వారు అంగీకరించారన్నారు. పెళ్లి కోసం జగత్సింగ్‌పూర్‌లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మే 17న దరఖాస్తు కూడా చేసుకున్నామన్నారు. శుక్రవారం స్లాట్ ఇవ్వడంతో ఎమ్మెల్యే రాలేదని, చాలాసేపు ఆయన కోసం చూసి వెళ్లిపోయినట్టు చెప్పారు. ఫోన్ చేసినా స్పందించలేదని, దీంతో తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సోనాలిక తెలిపారు.