హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ గొండు కోసాడు ఓ యువకుడు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఓ ఎమ్మెల్యే పిఏ నంటూ యువతీకి బెదిరింపులకు దిగాడు. తన కోరిక తీర్చకపోతే చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు. భర్తను వదిలేసి తనతో ఉండాలంటూ.. ఫేస్ బుక్ లో పరిచయం ఐన ఎమ్మెల్యే పిఏ విజయ్ సింహ..ఆ మహిళను బెదిరించాడు.
బిఎస్ మక్తాలో నివాసం ఉంటున్న మహిళ… ఈవెంట్స్ లో పనిచేస్తున్నది. ఇవాళ ఉదయం మహిళ ఇంట్లోకి వచ్చిన విజయసింహా… తన కోరిక తీర్చాలంటూ ఆమెపై బలవంతం చేయబోయాడు. దానికి ఆమె నిరాకరించడంతో బీర్ బాటిల్ పగలగొట్టి గొంతు కోశాడు విజయసింహ. దీంతో మహిళ గొంతుకు తీవ్రగాయాలు అయ్యాయి. అక్కడితో ఆగకుండా.. ఆమె చేయిని విరిచేసి, పిడుగుద్దులు గుద్దాడు విజయసింహ. ఈ విషయాన్ని వీడియో కాల్ చేసి భర్తకు చెప్పింది మహిళ. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చాడు మహిళ భర్త సూరజ్. ఈ ఉదయ్ సింహా ఓ TRS ఎమ్మెల్యే పీఏ అని సమాచారం అందుతోంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.