తెలంగాణ ప్రస్తుతం మునుగోడు మేనియా నడుస్తోంది. అయితే.. రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు మునుగోడు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడుతూ.. కేసీఆర్ 2014 ఎలక్షన్లలో నర్సాపూర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అన్నారు. నర్సాపూర్ కి కాళేశ్వరం నీళ్లు తెస్తా అన్నారు. కాళేశ్వరం నీళ్లు రాలే, నమ్మి నార బొస్తే పిచ్చి బురలయ్యాయి అన్నట్టు తయారైంది. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అన్ని పనులు అవుతాయి. పక్కనే ఉన్న నర్సాపూర్ లో మాత్రం ఎం కావు. ఎవరికి ఉద్యోగాలు రాలే..కేసీఆర్ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు వచ్చాయి. ఇవాళ్టి మీటింగ్ కి రావొద్దు అని trs నేతలు డబ్బులు పంచుతున్నారు. టీఆర్‌ఎస్ ని బీఆర్‌ఎస్‌గా మార్చారు. టీఆర్‌ఎస్‌ని వీఆర్‌ఎస్ ఇచ్చాము. బీఆర్‌ఎస్‌కి ఇప్ప్పుడు కంపల్సరీ రిటైర్మెంట్ స్కిం (CRS ) ఇస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే.. అంతకుముందు.. మూడేళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్‌ను వెంటనే బదిలీ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురంలో శనివారం నిర్వహించిన బీజేపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉ న్నందున సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అధికారులు స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. మూడేళ్లకు పైబడి ఉద్యోగాలు చేస్తున్న సీపీతోపాటు ఇతర పోలీసు అధికారులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో గులాబీ జెండా ఏడాదికంటే ఎక్కువ ఎగరదని, పోలీసు అధికారులు ఇష్టారీతిన వ్యవహరించి బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదుచేస్తే సహించేదిలేదని హెచ్చరించారు.