జన జీవనం పూర్తిగా స్తంభించింది.. ఇకనైనా : ఎమ్మెల్యే రఘునందన్‌

-

గత ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. రాష్ట్రంలో వర్షాలతో జనం అవస్థలు పడుతుంటే మంత్రులు మాత్రం ఇండ్లకే పరిమితమయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల కోసం నిర్వహించిన మాక్‌ పోలింగ్‌లో రఘునందన్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వర్షాల వల్ల జన జీవనం పూర్తిగా స్తంభించినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా.. మంత్రులు ఇప్పటికైనా వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు రఘునందన్‌ రావు.

వర్షాల కారణంగా ఇల్లు కూలిపోయిన వారికి వెంటనే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు రఘునందన్‌ రావు. అయితే.. గత ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో 50శాతం ఓట్లు చెల్లుబాటుకాలేదని… నూటికి నూరు శాతం ఓటింగ్ నమోదుకావాలనే ఉద్దేశంతోనే ఈ రోజు శిక్షణ ఇచ్చినట్లు రఘనందన్‌ వెల్లడించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిందని, రాష్ట్ర ఎమ్మెల్యేలు ద్రౌపది ముర్ముకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు రఘునందన్‌ రావు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version