మానకొండూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు బిగ్ షాక్ తగిలింది. కరీంనగర్ జిల్లాలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి కాన్వయ్ పై యువకుల దాడి చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… యువకులపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతగా మారింది.
గన్నేరువరం మండలం గుండ్లపల్లి లో ఈ ఘటన చోటు చేసుకుంది. డబల్ రోడ్డు నిర్మాణం చేయాలని యువజన సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. అయితే.. వారికి సంఘీభావం తెలిపేందుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో… కవ్వంపల్లి తో పాటు పలువురి ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే తన కాన్వాయ్ పై జరిగిన దాడిని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రంగా ఖండించారు.
తిమ్మాపూర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంటుందన్న ఆయన.. అయితే కాంగ్రెస్ నేత కవ్వంపల్లి ఆధ్వర్యంలో దొంగచాటుగా ఈ దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము తలుచుకుంటే కవ్వంపల్లి ఈ నియోజకవర్గంలో ఉండలేరని హెచ్చరించారు రసమయి బాలకిషన్.