తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా… ఇవాళ ఇందిరా పార్క్ లో మహ ధర్నాలో కూర్చున్నారు సీఎం కేసీఆర్. దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారే విధంగా కేసీఆర్ ఈ ప్లాన్ వేశారు.
అయితే.. ఈ ధర్నాలో పాల్గొనడమే కాకుండా… మహా ధర్నా ముగిసిన తర్వాత ఇందిరా పార్కు నుండి రాజ్ భవన్ కు పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు సిఎం కెసిఆర్. టీఆర్‌ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సి లతో కలిసి కాలినడకన సీఎం కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. వయా తెలుగు తల్లి ప్లైఓవర్ నుండి సచివాలయం మీదుగా ఖైరతబాద్ ప్లైఓవర్ మీదుగా రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ వెళ్ల నున్నట్లు తెలుస్తోంది. రాజ్ భవన్ వెళ్లిన అనంతరం.. కేంద్రం తీరుపై గవర్నర్ కు వినితి పత్రం ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్.