ఎమ్మెల్యే కుమారుడి వీరంగం.. తాగిన మైకంలో కారును ఢీ..!!

కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హుకుం సింగ్ కరద కుమారుడు రోహితబ్ సింగ్ వీరంగం సృష్టించాడు. తాగిన మైకంలో ఓ వ్యాపారి కారును తన వాహనంతో ఢీకొట్టి ధ్వంసం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో చోటు చేసుకుంది. రోహితబ్ సింగ్ వ్యాపారి దినేష్ అహుజా కారును ఢీకొనడంతో పాటు ఆయనతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆ వ్యాపారి వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది.

ప్రమాదం
ప్రమాదం

రోహితబ్ సింగ్ కారును ఢీకొట్టడంతో దినేష్ నష్టపరిహారం చెల్లించాలని తెలిపాడు. దీంతో రోహితబ్ సింగ్ వ్యాపారితో దురుసుగా ప్రవర్తించాడు. డబ్బులు ఇవ్వడం కుదరదని గొడవకు దిగాడు. దీంతో ఆ వ్యాపారి పోలీస్ స్టేషన్‌కు రావాలని తెలిపాడు. దీంతో రోహితబ్ సింగ్ కత్తితో తన వెంట పరుగెడుతూ తన కారు విండోను బద్దలు కొట్టాడని వ్యాపారి ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.