ఏకగ్రీవమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక..టీఆర్ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవం

-

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులంతా ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేర ఈసీ కూడా అధికారికంగా ప్రకటన వెల్లడించింది. ఇటీవల 6 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు గడువు నేటితో ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలతో ఈ గడువు పూర్తయింది. దీంతో నామినేషన్లు వేసిన అభ్యర్థులకు పోటీ లేకపోవడం.. ఇతర పార్టీలకు తగినంత సంఖ్యా బలం లేకపోవడంతో వారు కూడా పోటీ చేయలేదు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయింది.

టీఆర్ఎస్ అభ్యర్థులు గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠ నెలకొంది. అయితే టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ .. అనేక సామాజిక సమీకరణాలు, పార్టీకి విధేయత, సీనియారిటీ ని ద్రుష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇటీవల కలెక్టర్ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వెంకట్రామిరెడ్డికి సీటు ఇచ్చారు. హుజూరాబాద్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కౌషిక్ రెడ్డికి కూడా ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. సీనియర్లు బండా ప్రకాష్, కడియం శ్రీహరి, గుత్తా సుఖందర్ రెడ్డిలకు కేసీఆర్ మరోసారి పదవులను కట్టబెట్టారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version