లిక్కర్ కేసులో కవిత దొరికిపోయింది – బండి సంజయ్

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దొరికిపోయింది అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తప్పు చేసిన వాళ్లంతా సింహం, పులి అంటూ పెద్ద హోల్డింగ్స్ పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. సిబిఐ అధికారులు చాయ్, బిస్కెట్ తినడానికి రాలేదని అన్నారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు బండి సంజయ్. చట్టం తన పని తాను చేసుకు పోతుంది అన్నారు. కవిత ఏమైనా స్వతంత్ర సమరయోధురాలా? లిక్కర్ దందాలో తప్పు చేసిన టిఆర్ఎస్ నేతలంతా జైలుకు పోవాల్సిందేనని అన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా నేడు ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్నారు సిబిఐ అధికారులు. రెండు వాహనాలలో వచ్చిన సిబిఐ అధికారులు బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలోని ఓ ప్రత్యేక గదిలో విచారిస్తున్నారు. సిబిఐ డిఐజి రాఘవేంద్ర వత్స ఆధ్వర్యంలో కవిత నివాసానికి చేరుకున్న అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ టీంలో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు. అయితే కవిత ఏం చెబుతున్నారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఆసక్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news