వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

-

తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా వైఎస్ షర్మిల చేస్తున్న ఆమరణ దీక్షను గత అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. గత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో లోటస్ పాండ్‌కు చేరుకున్న పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే తాజాగా షర్మిల ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ఆమె బిపి, డిహైడ్రేషన్, ఆర్తో స్టార్టిక్ హై టెన్షన్తో ఇబ్బంది పడుతున్నారని హెల్త్ బులిటన్లో పేర్కొన్నారు. అలాగే తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్, మెటబాలిక్ యాసిడోసిన్, ప్రి రీనల్ అజోటేమియా కూడా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. షర్మిలకు రెండు నుంచి మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని అపోలో వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు లేదా రేపు ఉదయం షర్మిలని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news