అంబేద్కర్‌కు భారతరత్న కూడా కాంగ్రెస్‌ ఇవ్వలేదు : మోదీ

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించి ఆ వర్గానికి దగ్గరైన బీజేపీ – తాజాగా తెలంగాణలో మరో కీలక సామాజికవర్గం ఎస్సీలకు చేరవయ్యే ప్రయత్నం చేపట్టింది. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి – MRPS నిర్వహిస్తున్న మాదిగ విశ్వరూప మహాసభలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. భారత్ మాతా కీ జై అంటూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. సమ్మక్క-సారలమ్మ, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఈ సభకు వచ్చిన వారికి శుభాకాంక్షలు తెలిపారు మోదీ.

అంతేకాకుండా.. ‘తెలంగాణ మాదిగ సమాజానికి అభినందనలు. మందకృష్ణ మాదిగ.. నా చిన్న తమ్ముడు. ఎంతో ప్రేమతో ఈ సభకు నన్ను ఆహ్వానించారు. స్వాతంత్ర్యం వచ్చాక అనేక ప్రభుత్వాలను చూశారు. ఆ ప్రభుత్వాలకు.. మా ప్రభుత్వానికి తేడా గమనించాలి. సామాజికి న్యాయానికి బీజేపీ కట్టుబడి ఉంది. అంబేద్కర్‌కు భారతరత్న కూడా కాంగ్రెస్‌ ఇవ్వలేదు. తెలంగాణ పోరాటంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయి. అధికారంలో వచ్చాక బీఆర్‌ఎస్‌ అందరినీ విస్మరించింది. ఎన్నో బలిదానాల తర్వాత తెలంగాణ ఏర్పడింది. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారు. దళితుల సీఎం కూర్చీని కేసీఆర్‌ కబ్జా చేశారు. మాదిగ సామాజికవర్గాన్ని కూడా విస్మరించారు. తెలంగాణ అస్థిత్వాన్ని బీఆర్‌ఎస్‌ కాపాడలేకపోయింది. దళిత బంధుతో మాదిగలకు న్యాయం జరగలేదు. 3 ఎకరాల భూమి హామీని బీఆర్‌ఎస్‌ నిలబెట్టుకోలేదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు దళిత విరోధులు. ఆ రెండు పార్టీలతో దళితులు జాగ్రత్తగా ఉండాలి. మాదిగల పోరాటానికి సంపూర్ణ మద్దతు. వన్‌ లైఫ్‌, వన్‌ విషన్‌లా మందకృష్ణ పోరాటం చేశారు.’ అని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version