అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ mYoga App ని విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. దీని వలన చాల లాభాలు పొందొచ్చు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో కలిసి భారతదేశం ఈ ముఖ్యమైన స్టెప్ ని తీసుకోవడం జరిగింది. వివిధ భాషల తో యోగ ట్రైనింగ్ వీడియోలు కూడా ఈ యాప్ ద్వారా మనకి అందుబాటులో ఉంటాయి. దీని వల్ల వన్ వరల్డ్ వన్ హెల్త్ సాధించడానికి వీలవుతుంది.
నిపుణుల సలహాతో దీనిని అభివృద్ధి చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ యాప్ చాలా సేఫ్ మరియు సురక్షితం అని చెప్పింది. ఇది ఇలా ఉంటే యూజర్ల దగ్గర నుండి ఎటువంటి డేటాని కూడా కలెక్ట్ చేయలేదు అని చెప్పింది.
12 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకూ ఈ యోగాను చేసుకోవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా పబ్లిక్ ఈవెంట్స్ జరగకపోయినప్పటికి యోగా ఏమాత్రము తగ్గడం లేదు అని అన్నారు. ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరికొంత మంది ప్రజలని యోగా చేయడానికి ప్రోత్సహించాలని అన్నారు.