మోదీ టూర్: బీజేపీ అలియాస్ వైసీపీ.!

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ టూర్ ఉన్న విషయం తెలిసిందే. 11వ తేదీన మోదీ విశాఖ టూర్ ఉంది..ఆ టూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించనున్నారు. 12వ తేదీన తెలంగాణలోని రామగుండం టూర్ ఉంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణలో పర్యటన సందర్భంగా మోదీకి ఘన స్వాగతం పలికేందుకు అక్కడ బి‌జే‌పి పెద్ద ఎత్తున  సిద్ధమవుతుంది. మోదీ పర్యటనని అక్కడ అధికార టి‌ఆర్‌ఎస్ పట్టించుకోవడం లేదు.

కానీ ఏపీలో పరిస్తితులు భిన్నంగా ఉన్నాయి..మోదీ పర్యటనని విజయవంతం చేయడానికి ఇక్కడ ఉన్న బి‌జే‌పి పార్టీ కంటే..అధికార వైసీపీ ఎక్కువ కష్టపడుతుంది. గత కొన్ని రోజులుగా మోదీ పర్యటనకు సంబంధించి వైసీపీ మంత్రులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ సిద్ధమవుతుంది. అయితే బి‌జే‌పికి వైసీపీ ఏమి మిత్రపక్షం కాదు..ఫార్మాలిటీ, ప్రోటోకాల్ ప్రకారం పనిచేయొచ్చు.

కానీ అది దాటేసి బి‌జే‌పి చూడాల్సిన పనులని కూడా వైసీపీనే చూసుకుంటుంది. పైగా లక్ష మందితో మోదీ సభ నిర్వహించేందుకు వైసీపీ సన్నాహాలు చేస్తుంది. ఆంధ్రా యూనివర్సిటీ క్రీడా మైదానంలో సభని భారీ ఎత్తున నిర్వహించాలని చూస్తుంది. ఈ సభకు లక్ష మంది జనాలని తరలించాలని చూస్తుంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తుంది. మామూలుగా జగన్ సభకు ఇలా జన సమీకరణ చేస్తారు..కానీ ఇప్పుడు మోదీ సభకు వైసీపీ జన సమీకరణ చేస్తున్నారు.

దీనిపై విమర్శలు వస్తున్నాయి..మోదీ మెప్పు కోసం వైసీపీ తిప్పలు పడుతుందని, హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ అంశాలని గాలికొదిలేసి..మోదీని ప్రసన్నం చేసుకునేందుకు కష్టపడుతుందని, అటు ప్రతిపక్ష టి‌డి‌పి ఎలాగో మోదీకి భయపడుతుందని, వైసీపీ ఏమో ఇలా మోదీకి సేవలు చేసుకుంటుందని విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి మోదీ పర్యటనని విజయవంతం కోసం బి‌జే‌పి కంటే ఎక్కువ వైసీపీ కష్టపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news