ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 9సార్లు జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే కార్యక్రమం ఏదైనా తన డ్రెస్సింగ్ స్టైల్‌తో స్పెషల్‌గా కనిపిస్తారు. సంప్రదాయ దుస్తువులను ధరించి స్టైలిష్‌గా ఉంటారు. అయితే 9 సార్లు జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మోడీ ధరించిన తలపాగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ రోజు ధరించిన తలపాగాతో అది హాట్ టాపిక్‌గా మారింది.

2014లో ప్రధాని మోడీ క్రీమ్ కలర్ డ్రస్ ధరించి.. రెడ్ కలర్ తలపాగాకు గ్రీన్ కలర్ బార్డర్ ఉంది. 2015లో క్రీమ్ కలర్ కుర్తా, దానిపై జాకెట్ వేసుకున్నారు. ఆరెంజ్ కలర్ పగడీపై ఆకుపచ్చ, ఎరుపు, నీలం గీతలున్న తలపాగాను ధరించారు. 2016లో వైట్ కలర్ కుర్తా.. ఎరుపు, గులాబీ రంగులోకి తలపాగా ధరించారు. 2017లో క్రీమ్ కలర్ కుర్తా, రెండ్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న తలపాగా ధరించారు. 2018లో ఆరెంజ్ కలర్ ప్లెయిన్ తలపాగా ధరించారు.
2019లో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల కాంబినేషన్‌లోని తలపాగా వేసుకున్నారు. 2020లో కాషాయం, పసుపు రంగు తలపాగాను వేసుకున్నారు. 2021లో కాషాయం రంగుపై రెడ్ కలర్ గీతలున్న తలపాగా ధరించారు. నేడు వైట్ కలర్ కుర్తాపై బ్లూ కలర్ జాకెట్ ధరించారు. గ్రీన్, ఆరెంజ్ కలర్ గీతలున్న తలపాగాను వేసుకున్నారు.