ఏపీలో ఉపాధ్యాయులకు సైతం నిమిషం నిబంధన.. ఆలస్యమైన అంతే..

-

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో విద్యార్థులకు నిమిషం నిబంధన పెట్టినట్లుగానే.. ఉపాధ్యాయులకు సైతం నిమిషం నిబంధనను అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయులకు రేపటి నుంచి కొత్త హాజరు విధానం రాబోతోంది. ఇప్పటి వరకు ఉన్న బయోమెట్రిక్, ఐరిస్ హాజరు విధానం స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్‌ను విద్యాశాఖ తీసుకొచ్చింది. దీని కోసం ‘సిమ్స్‌-ఏపీ’ అనే మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఉపాధ్యాయులు సహా పాఠశాలల్లో పనిచేసే అందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తొలుత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన లాగిన్‌లో పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు నమోదు చేయాల్సి ఉంటుది. వారికి ఎన్ని సెలవులు ఉన్నాయో కూడా అందులో పేర్కొనాలి.

Mahatma Gandhi Kashi Vidyapith Now Biometric Attendance New System Will Be  Applicable On Officers Teachers Employees And Students - अब काशी विद्यापीठ  में दर्ज होगी बायोमेट्रिक हाजिरी, अधिकारियों ...

అనంతరం వారి ఫొటోలను మూడు యాంగిల్స్‌లో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు పాఠశాలకు వచ్చిన వెంటనే యాప్‌లో లాగిన్ అయి ఫొటో తీసుకుని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఉదయం 9 గంటలలోపే చేయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా యాప్ అంగీకరించదు. ఫలితంగా ఆబ్సెంట్ పడుతుంది. కాబట్టి లీవ్ పెట్టకోవాలని సూచిస్తుంది. అలాగే, ఎక్కడున్నా 9 గంటలలోపు ఫొటో తీసుకుని అప్‌లోడ్ చేస్తామంటే కుదరదు. జీపీఎస్ ఆధారంగా ప్రతి పాఠశాలను గుర్తిస్తారు. కాబట్టి పాఠశాల ఆవరణలోనే ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే, ఉపాధ్యాయులు కచ్చితంగా 9 గంటలలోపు స్కూల్లో ఉండాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news