నారా లోకేష్‌ కు వ్యతిరేకంగా ప్రచారం చేశా : బాలయ్యతో మోహన్‌ బాబు ఎమోషనల్‌ !

మా అసోయేషన్‌ అధ్యక్ష ఎన్నికల అనంతరం… హీరో నందమూరి ఇంటికి.. స్వయంగా మంచు విష్ణు మరియు మంచు మోహన్‌ బాబు వెళ్లారు. ఈ సందర్భంగా డైలాగ్‌ కింగ్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ అల్లుడి (నారా లోకేష్‌ ) ఓటమి కోసం ప్రచారం చేశానని.. కానీ బాలకృష్ణ మాత్రం మా అర్టిస్ట్‌ అసోషియేషన్ ఎన్నికల్లో తన కొడుకు మంచు విష్ణు గెలుపు నకు కృషి చేశారని ఎమోషనల్‌ అయ్యారు మోహన్‌ బాబు.

మా అర్టిస్ట్‌ అసోషియేషన్ ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ… చాలా సంస్కారం తో వ్యవహరించారని పేర్కొన్నారు మోహన్‌ బాబు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు సినిమా బిడ్డలందరికి విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు మోహన్‌ బాబు. కాగా.. మా అర్టిస్ట్‌ అసోషియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్‌ కే నందమూరి బాలయ్య సపోర్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్‌ ఘన విజయం సాధించింది.