డ‌బ్బు క‌ట్టాల్సిందే.. షాక్ ఇచ్చిన యూట్యూబ్

-

యూట్యూబ్ ప్ర‌స్తుతం కాలంలో స్మార్ట్ ఫోన్ లో ఎక్కువ వాడుతున్న వాటిలో ప్ర‌ధానమైంది. యూట్యూబ్ లో ప్ర‌తి రోజు చాలా వీడియోలు డౌన్ లోడ్ అవుతుంటాయి. సినిమాల‌కు సంబంధించిన సాంగ్స్, టీజ‌ర్స్, ట్రైల‌ర్స్ కూడా యూట్యూబ్ లోనే విడుద‌ల చేస్తారు. అయితే మ‌న‌కు యూట్యూబ్ లో ఎదైనా.. వీడియో న‌చ్చితే.. వెంట‌నే హెచ్ డీ క్లారిటీ తో డౌన్ లోడ్ చేస్తాం. అయితే తాజా గా యూట్యూబ్ తీసుకున్న నిర్ణ‌యంతో ఇక నుంచి హెచ్ డీ క్లారిటీ తో వీడియోలు డౌన్ లోడ్ చేయ‌డానికి డ‌బ్బులు క‌ట్టాల్సిందే. అంటే యూట్యూబ్ లో హెచ్ డీ క్లారిటీ వీడియోలు డౌన్ లోడ్ చేయ‌డానికి ప్రీమియం స‌బ్ స్క్రిప్ష‌న్ కట్టాల్సిందేన‌ని యూట్యూబ్ తెలిపింది.

ఇప్ప‌టి వ‌ర‌కు యూట్యూబ్ లో మీడియం, హై, ఫుల్ హెచ్ డీ క్వాలిటీ వీడియో ల‌ను ఉచితం గా డౌన్ లోడ్ చేసుక‌వ‌చ్చు. అయితే తాజా గా యూట్యూబ్ తీసుకున్న నిర్ణ‌యంతో మీడియం క్వాలిటీ ఉన్న వీడియోల‌నే ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. దానికి మించి క్వాలిటీ డౌన్ లోడ్ చేసుకోవాలంటే నెల నెల డ‌బ్బులు క‌ట్టాల్సిందే. అయితే యూట్యూబ్ ఇప్ప‌టికే యాడ్ ఫ్రీ గా వీడియో లు చూడాలంటే.. నెల నెల స‌బ్ స్క్రిప్ష‌న్ చేసుకోవాల‌ని నిబంధ‌న పెట్టిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version