ఈ పండ్ల తొక్కలతో మరెంత అందం..!

-

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది అలానే పండ్ల తొక్కలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్ల తొక్కలు అందాన్ని రెట్టింపు చేయడానికి సహాయ పడతాయి. పండ్ల తొక్కలని ఎలా ఉపయోగించాలి..? ఏఏ పండ్ల తొక్కలని ఉపయోగించవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

నారింజ తొక్కలు:

నారింజ తొక్కలతో అందాన్ని రెట్టింపు చేసుకోవొచ్చు ఇందులో పోషక పదార్థాలు ఉంటాయి డార్క్ స్పాట్స్ ని తొలగిస్తాయి. అలానే జుట్టును కూడా తొలగించి మెరిసే చర్మాన్ని అందిస్తుంది.

అరటిపండు తొక్క:

అరటిపండు తొక్క కూడా చాలా మేలు చేస్తుంది ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి చర్మాన్ని సాఫ్ట్ గా ఇది మారుస్తుంది.

ఆపిల్ తొక్క:

ఆపిల్ తొక్కలో పోషక పదార్థాలు స్కిన్ టోన్ ని మెరుగుపరుస్తాయి చర్మానికి హైడ్రేట్ గా ఉంచుతాయి. డార్క్ స్పాట్స్ ని తొలగిస్తుంది.

దానిమ్మ తొక్క:

దానిమ్మ తొక్క కూడా బాగా ఉపయోగపడుతుంది చర్మానికి కావాల్సిన తేమని ఇది అందిస్తుంది. చర్మం మెరిసిపోతుంది దానిమ్మ తొక్కతో.

నిమ్మ తొక్క:

నిమ్మ తొక్కని రాస్తే ముడతల సమస్య దూరం అవుతుంది.

మామిడి తొక్క:

మామిడి తొక్క చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది చర్మాన్ని యువి కిరణాల నుండి రక్షిస్తుంది మామిడి తొక్క.

బొప్పాయి తొక్క:

బొప్పాయి తొక్కలో పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి. పిగ్మెంటేషన్ ని ఇది తగ్గిస్తుంది. ఇలా ఈ పండ్లు తొక్కలతో చక్కటి లాభాలు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news