మార్నింగ్ రాగా : మీడియాలో ఆడాళ్లు !

-

ఉద‌యం ఇంటికి క‌ళ్లు తెరిచే లోకం..క‌ళ్లు మూసుకుని న‌టించే లోకం.ఈ రెండూ వేర్వేరు.అలాంట‌ప్పుడు మీడియాలో ఆడాళ్లు, బయ‌ట ఆడాళ్లు వేర్వేరు.మేం వేద‌న‌లో ఉన్నాం అని మాత్ర‌మే అన‌గ‌ల‌రు.కానీ దానిని దాటి ఏం చెప్ప‌లేరు చేయ‌లేరు.ఏం బాధ‌ప‌డుతున్నాం అని మాత్రమే చెప్ప‌గ‌ల‌రు.కానీ వాటికి చ‌ట్టం న్యాయం శిక్ష లాంటి ప‌దాల ఆపాద‌న ఇవ్వ‌నివ్వ‌రు.
ఆడాళ్లంతా మీడియాలో న‌లిగిపోతున్నారు. న‌లిగి పోయిన జీవితాల‌న్నీ చీక‌ట్లో కొట్టుకుపోతున్నాయి. వీటికి కూడా కొంద‌రంటే కొంద‌రు ఆడాళ్లే కార‌ణం.ఆడాళ్ల మ‌ధ్య నలిగిపోతున్న ఆడాళ్లు.మ‌గాళ్ల మ‌ధ్య న‌లిగిపోతున్న ఆడాళ్లు.. జీవితం కోల్పోతున్న ఆడాళ్లు..శీలం గుణం అన్నింటినీ వ‌దిలిన కొంద‌రు మ‌గాడిద‌ల మ‌ధ్య ఆడాళ్లు. సంస్కారం లేని మ‌గాళ్లు. సంస్కారం లేని ఆడాళ్లు.అంతా క‌లిసి చేస్తున్న నాట‌కం ఇది.

 

మీడియాలో ఆడాళ్ల‌ను గౌర‌విస్తున్నారా ? ఏం లేదు ఏ గౌర‌వ‌మూ లేదు. క‌నీసం వాళ్ల‌ను గుర్తిస్తున్నారా అంటే అదీ లేదు. ఇంకేం చేస్తున్నారు వీళ్లు. మ‌నుషుల‌ను మ‌నుషులుగా గుర్తించ‌డం ఓ గొప్ప నేర్పు.అందుకే  మీడియాలో  అంద‌రూ ఒకే విధంగా ఉండ‌రు. ఉండ‌లేరు కూడా! దేశంలో మ‌నుషులు మ‌నుషుల్లానే ఉంటున్నారా లేదు క‌దా! అలానే మీడియాలో కూడా అలానే ఉండ‌రు. ఉండ‌లేరు కూడా! పోనీ లైంగిక వేధింపులు ఆప‌గ‌ల‌గ‌డం సాధ్య‌మా అంటే అదీ లేదు.ఇంకేం చేయ‌గ‌ల‌రు వీళ్లు.వీళ్లంతా పాపిష్టి మ‌నుషులు.మురికితనం ఉన్న మ‌నుషులు. ఈ మురికి ఇప్ప‌ట్లో పోదు గాక పోదు.వదిలించుకోవ‌డ‌మే క‌ష్టం.

Read more RELATED
Recommended to you

Latest news