ఇంటికి పిలిచి కొడుకు ప్రేయసిపై తల్లి ఇనపరాడ్డుతో దాడి.. !

-

తన కొడుకుతో పెళ్లి చేస్తానని చెప్పి ఓ తల్లి కొడుకు ప్రేయసిని ఇంటికి పిలిచి దాడి చేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్ కు చెందిన భరత్ చంద్ర 26 మోతీ బజార్ కు చెందిన శ్రావణి 21 నాలుగేళ్ల ప్రేమించుకున్నారు. ఇది ఇలా ఉంటే భరత్ చంద్ర కు ఇటీవలే తల్లిదండ్రులు వివాహం చేసేందుకు సంబంధం చూశారు. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఈ నెల 27న వివాహం నిశ్చయించారు. దాంతో ఈ నెల 9న బరత్ చంద్ర తన ప్రియురాలి తో కలిసి ఇంటి నుండి పారిపోయాడు.

Mother attack on son girl friend

కాగా భారత్ చంద్ర తల్లి అతనికి ఫోన్ చేసి ప్రేమించిన యువతి తోనే పెళ్లి చేస్తానని ఇంటికి రావాలని కోరింది. దాంతో తల్లిని నమ్మి భరత్ చంద్ర ప్రియురాలితో కలిసి ఇంటికి వచ్చాడు. నిన్న రాత్రి భరత్ చంద్ర తల్లి శ్రావణి తో వాగ్వాదానికి దిగింది. అంతే కాకుండా శ్రావణి పై ఇనుప రాడ్డుతో తీవ్రంగా దాడి చేసింది. దాంతో గాయాలతో శ్రావణి బయటకు వచ్చింది. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version