అన్నమయ్య జిల్లాలో దారుణం.. కోడలి తలనరికిన అత్త.. నరికిన తలతో పోలీస్‌ స్టేషన్‌కు

-

రోజు రోజుకు మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. డబ్బు కోసం, ఆస్తి కోసం, లైంగిక సంబంధాల కోసం ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. కోడ‌లి త‌లన‌రికి చంపిన అత్త… ఆ త‌ర్వాత కోడ‌లి త‌ల‌ను చేతిలో ప‌ట్టుకుని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయింది. అంతేకాకుండా త‌న కోడ‌లిని తానే హ‌త్య చేశానంటూ పోలీసుల ఎదుట నిర్భ‌యంగా నేరాన్ని ఒప్పుకుంది. ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకెళితే… జిల్లాలోని రాయ‌చోటి మండ‌లం కె.రామాపురంలో సుబ్బ‌మ్మ నివ‌సిస్తోంది. కోడ‌లు వ‌సుంధ‌ర (35)తో ఆమెకు గ‌త కొంత‌కాలంగా కుటుంబ క‌ల‌హాలు కొన‌సాగుతున్నాయి.

ఈ క్ర‌మంలో గురువారం ఆవేశంతో ఊగిపోయిన సుబ్బ‌మ్మ‌… కోడ‌లు వ‌సుంధ‌ర‌పై దాడికి దిగింది. క‌త్తి తీసుకుని వ‌సుంధ‌ర త‌ల న‌రికేసింది. ఆ వెంటనే, తెగి ప‌డిన వ‌సుంధ‌ర త‌ల‌ను చేత బ‌ట్టుకుని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లింది. త‌న కోడ‌లిని తానే హ‌త్య చేశాన‌ని పోలీసుల‌కు చెప్పింది. కోడ‌లి త‌ల‌తో సుబ్బ‌మ్మ అలా న‌డుచుకుంటూ వెళుతుంటే… జ‌నం భయంతో వణికిపోయారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version