తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, నేడు ప్రపంచ మాతృదినోత్సవం సందర్బంగా మాట్లాడుతూ.. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు మరెవ్వరూ లేరు అని అన్నారు. అలాంటి తల్లిని సంరక్షించుకునేందుకు సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు తెలంగాణ సర్కారు అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి తెలియజేశారు. బిడ్డ కడుపులో పడగానే – కేసీఆర్ న్యూట్రిషన్ కిట్,బిడ్డ పుట్టగానే – కేసీఆర్ కిట్, బాలింతలు, గర్భిణులకు పౌష్ఠికాహారం అందించేందుకు – ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్య సమస్యలు ముందుగానే గుర్తించి సత్వర చికిత్స అందించేందుకు – అరోగ్య మహిళ, వ్యాధి నిరోధకత పెంచేలా – 100% శాతం ఇమ్యునైజేషన్, ఇంటి నుండి ఆసుపత్రికి, ఆసుపత్రి నుండి ఇంటికి ఉచిత ప్రయాణ సేవలు – అమ్మ ఒడి వాహనాలు, రాష్ట్ర వ్యాప్తంగా 28 మాతా శిశు సంరక్షణ కేంద్రాలు..ఇవన్నీ తల్లులు, ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన రక్షణ వలయం అని గుర్తు చేశారు మంత్రి హరీశ్ రావు.
2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గినాట్లు తెలిపారు ఆయన. ఇది తల్లులు, ఆడ బిడ్డల సంరక్షణ పట్ల కేసీఆర్ గారికి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధికి నిదర్శనం. దేవుడు అన్ని వేళలా, అన్ని చోట్ల అందుబాటులో ఉండలేడు కాబట్టి, ఆ దేవుడే అమ్మను సృష్టించాడు, ప్రతి ఒక్కరికీ అమ్మను అందించాడు అంటారు అని అన్నారు. . అలాంటి అమ్మల ఆరోగ్యాన్ని కాపాడటం అందరి బాధ్యత. అనవసర కడుపు కోతలు తగ్గాలి, తల్లుల గోస తీరాలి అనే నినాదంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.. మాతృ ముర్తులందరికి ప్రపంచ తల్లుల దినోత్సవం శుభాకాంక్షలు అని తెలిపారు.