మదర్స్ డే. ప్రపంచంలోని మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికోసం పత్యేకంగా తీపి పదార్థం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అమ్మ చేసిన త్యాగాలకి, అమ్మపై ప్రేమను చూపించడానికి కేవలం ఒక్కరోజే సరిపోదు. మీరెంత చూపించిన అది అమ్మ ప్రేమ ముందు తక్కువే అవుతుంది. ప్రస్తుతం మీ మాతృమూర్తికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసాక ఒక చక్కటి తీపి పదార్థంతో నోరు తీపి చేయండి. ఆ తీపి పదార్థాన్ని ఎక్కడి నుండో కొనుక్కుని రావద్దు. ఇంట్లో స్వయంగా మీరే తయారు చేయండి. ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా? రెసెపీ ఇదిగో..
పదార్థాలు
మామిడికాయ వెరైటీ కోసం
మామిడి 300గ్రాములు
ఒక నిమ్మకాయ
చక్కెర – 20గ్రాములు
ఇతర పదార్థాలు
పాలు 200మిల్లీ లీటర్లు
క్రీమ్ 200మిల్లీ లీటర్లు
వెనీలా అర టీ స్పూను
జెలటిన్ పౌడర్ 8గ్రాములు
తయారీ పద్దతి
ఒక కుండలో పాలు, క్రీము, చక్కెర, వెనీలా, మామిడిని కలపండి.
ఒక పాత్రలో జెలటిన్ పౌడర్ వేసి అందులో చల్లని నీటిని కలపండి. ఈ జెలటిన్ ని పొయ్యి మీద ఉన్న మామిడి పదార్థానికి కలపండి. ఆ తర్వాత దానికి నిమ్మరసాన్ని మిక్స్ చేయండి. అప్పుడు దాన్ని గ్లాసుల్లో పోసి రిఫ్రిజిరేటర్ లో ఉంచండి. తర్వాత దాన్ని అందరికీ సర్వ్ చేసేటపుడు ముక్కలుగా కోసిన మామిడి కాయలని పై పైన ఉంచండి. ఇప్పుడు హ్యాపీగా మామిడి తీపి పదార్థాన్ని ఆనందించండి.
బయట మహమ్మారి వీర విహారం చేస్తుంది కాబట్టి రెస్టారెంట్లకి వెళ్ళకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉండి చక్కటి రెసిపీలు తయారు చేసుకోండి.