సీబీఐ నోటీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్

-

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సిబిఐ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సిబిఐ ఇచ్చిన నోటీసులపై అవినాష్ రెడ్డి కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని కోర్టును కోరారు అవినాష్ రెడ్డి. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి అరెస్టు చేయొద్దని, విచారణ మొత్తం వీడియో రికార్డ్ చేయాలని అవినాష్ రెడ్డి కోరారు.

అలాగే తన న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే రేపు అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరుకానున్న విషయం తెలిసిందే. అవినాష్ రెడ్డిని సిబిఐ మూడోసారి విచారణకు పిలిచిన నేపథ్యంలో ఈసారి అరెస్టు చేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Read more RELATED
Recommended to you

Latest news