కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ స్టిక్కర్లు వేసుకుంటుంది: ఎంపీ జీవీఎల్

-

కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ స్టిక్కర్లు వేసుకుంటుందని.. బీజేపీ నేత ఎంపీ జీవీఎల్ విమర్శించారు. పెట్రో కెమికల్ కాంప్లెక్స్.. కాకినాడలో నిర్మాణం చేస్తామంటే హెపీసీఎల్-గెయిల్ ముందుకు వస్తే.. దాన్ని నిర్మాణానికి కావాల్సిన సహకాారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించలేదని అన్నారు. మీకు ప్రచార ఆర్భాటం, స్టిక్కర్లు వేసుకోవడం తప్పితే..నిజమైన రాష్ట్ర అభివ్రుద్ధిపై చిత్త శుద్ధి ఉండా అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏడేళ్లలో రూ. 35 వేల కోట్లు ఖర్చుపెట్ట జాతీయ రహదారులను రెట్టింపు చేస్తే దాంట్లో మీరు పోషించిన పాత్ర ఏమిటని.. వైసీపీ చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. అక్కడ కూడా మీ ఎంపీలు ఏమో సాధించాం.. లేఖలు ఇచ్చాం అని చెప్పి.. జబ్బలు చరుచుకోవడం తప్పితే చేసిందేం లేదు అని అన్నారు. కేంద్రం చేసిన అభివ్రుద్దికి ధన్యవాదాలు చెప్పే సంస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేర్చుకోవాలని అన్నారు. ఎక్కడ బీజేపీ ఎదిగిపోతుందేమో అని.. బురద జల్లే ప్రయత్నం చేశారు. 2014-15లో రూ. 24,500 కోట్లు వచ్చే ఏపీ ప్రభుత్వానికి 2020-21లో రూ. 27 వేల కోట్లు పెరిగి…రూ.77000 కోట్లు వచ్చాయని.. పన్నుల వాటాతో పాటు గ్రాంట్ల రూపంలో కేంద్రం ఏపీ రాష్ట్రానికి ఇచ్చామని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news