సీఎం కేసీఆర్‌ నిర్ణయం చారిత్రాత్మకం : ఎంపీ నామా నాగేశ్వర్‌రావు

-

తెలంగాణలో నూతనంగా నిర్మిస్తు్న్న సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం యావత్ జాతికి గర్వకారణమని ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అన్నారు. తెలంగాణ సమాజం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం నిర్ణయం చారిత్రాత్మకమన్నారు నామా నాగేశ్వర్‌రావు. దళిత, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడి పేరును సచివాలయానికి పెట్టడం ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు నామా నాగేశ్వర్‌రావు.

Nama Nageswara Rao : మా డిమాండ్లను కేంద్రం పెడచెవిన పెడుతోంది - NTV Telugu

సీఎం కేసీఆర్ నిర్ణయంతో దళిత, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం మరింత పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్‌ భవనానికి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు నామా నాగేశ్వర్‌రావు. అంబేద్కర్‌పై ఉన్న గౌరవాన్ని సీఎం కేసీఆర్ మరోసారి సగర్వంగా చాటుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి ఆదర్శమన్నారు నామా నాగేశ్వర్‌రావు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెడితే భారతదేశం ప్రతిష్ట , గౌరవం ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుందని నామా నాగేశ్వర్‌రావు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news