‘శివ పుత్రుడు’ షూటింగ్‌లో అలా జరిగింది.. ఆశ్చర్యపోయే విషయం చెప్పిన సంగీత..

-

ప్రముఖ తమిళ దర్శకుడు బాలా దర్శకత్వంలో వచ్చిన ‘పితామగన్’ పిక్చర్ సూపర్ హిట్ అయింది. తెలుగులో ‘శివ పుత్రుడు’గా విడుదలైన ఈ చిత్రంలో కథానాయకులుగా విక్రమ్, సూర్య నటించగా, కథానాయికలుగా సంగీత, లైలా నటించారు. ఇందులో విక్రమ్ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. కాగా, ఈ చిత్ర షూటింగ్ లో జరిగిన ఆసక్తికర, ఆశ్చర్యకర సంఘటనను తాజాగా సంగీత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

‘శివపుత్రుడు’ షూటింగ్ జరిగే నాటికే సంగీత హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమా కోసం దర్శకుడు బాలా సంగీతను పిలిచి షూటింగ్ నిమిత్తం 90 రోజులు కావాలని అడిగాడు. అప్పుడు సంగీత తప్పుగా అర్థం చేసుకుని 19 రోజులే కదా ఇస్తానని అందట. అప్పుడు దర్శకుడు బాలా సీరియల్ గా 90 రోజులు అంటే మూడు నెలలు కావాలని అడిగారట. అప్పుడు సాధ్యం కాదని చెప్పింది సంగీత. అలా ఈ సినిమా వదిలి వేరే షూటింగ్ కు వెళ్లిపోయింది.

ఈ క్రమంలోనే రోజులు గడిచాయి. అప్పటికే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి సంగీత అవార్డు అందుకుంది. అంతలోనే దర్శకుడు కృష్ణవంశీ ..బాలా సినిమాలో నటించే అవకాశం వస్తే వదులుకోవడం సరికాదని అన్నాడు. అలా ఆ సినిమా యూనిట్ సభ్యులు అందరూ సంగీతపైన కోప్పడ్డారు. దాంతో తర్వాత సంగీత ..దర్శకుడు బాలాకు సారీ చెప్పి..నెక్స్ట్ సినిమాలో అవకాశం ఉంటే ఇవ్వాలని అడిగింది. అప్పుడు ఆ దర్శకుడు డైరెక్ట్ గా మధురైకి రావాలని చెప్పాడు.

అలా ‘శివపుత్రుడు’ సినిమా షూటింగ్ కు వచ్చిన సంగీత..కు టెస్ట్ షూట్ నిర్వహించారు. ఆ సీన్ షూట్ అయిన టైమ్ లో యూనిట్ సభ్యులందరూ క్లాప్స్ కొట్టారు. అప్పుడు సంగీతకు ఎవరో చెప్పారట.ఈ పాత్ర కోసం 30 మంది హీరోయిన్స్ ను తీసుకోగా అందరూ ఫెయిల్ అయ్యారట. 31వ హీరోయిన్ గా వచ్చిన సంగీత ఓకే అయింది. అలా టెస్ట్ షూట్ లో చేసిన సీన్ ఒరిజినల్ ఫిల్మ్ లో పెట్టేశారు.

ఒకవేళ తాను ‘శివపుత్రుడు’ పిక్చర్ చేయకపోయి ఉంటే లైఫ్ లో రిగ్రెట్ ఫీల్ అయ్యే దానినని చెప్పుకొచ్చింది సీనియర్ హీరోయిన్ సంగీత. సంగీత ప్రస్తుతం పలు సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news