తెలుగు సినిమా ప్రపంచ నలుమూలల ఖ్యాతి ఘడించేలా చేసిన సినీ రచయిత విజేంద్ర ప్రసాద్‌కు అభినందనలు తెలిపారు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. గురువారం ఆయన విజయేంద్ర ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి.. రాష్ట్రపతిచే నామినేట్ చేయడబడినందుకు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అయితే.. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ కథా రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి కోటాలో పలు రంగాలకు చెందిన నలుగురిని నామినేట్ చేస్తూ నరేంద్ర మోదీ సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ జాబితాలో విజయేంద్ర ప్రసాద్‌తో పాటు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా, పరుగుల రాణి పీటి ఉష, వీరేంద్ర హెగ్డేలను ఎన్డీఏ సర్కారు రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… విజయేంద్ర ప్రసాద్ సినీ రంగానికి చేసిన కృషిని కీర్తించారు. దశాబ్దాలుగా సినీ రంగానికి విజయేంద్ర ప్రసాద్ సేవలందిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. విజయేంద్ర ప్రసాద్ చేసిన కృషి వల్ల భారత సంస్కృతి విశ్వవ్యాప్తమైందని కూడా మోదీ తెలిపారు.
Hearty congratulations to Sri K.V. #VijayendraPrasad garu, our own story writer, who took our cinema to the world stage, as he has been nominated to Rajya Sabha by the President of India. It will be an honour for me to share the floor with likes of him.@ssrajamouli pic.twitter.com/EUPS4eSSal
— Santosh Kumar J (@MPsantoshtrs) July 7, 2022