విశాఖలో ప్రధాని బహిరంగ సభ రాజకీయాలకు అతీతంగా చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని ఎంపీ విజయ సాయిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 11 న ప్రధాని విశాఖ రానున్నారన్నారు. ఈ నెల 12 వ తేదీన బహిరంగ సభ జరగనుందని ఎంపీ విజయ సాయిరెడ్డి వెల్లడించారు. ప్రధాని బహిరంగ సభ విజయ వంతం కావడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ఎంపీ విజయ సాయిరెడ్డి తెలిపారు. జిల్లా అధ్యక్షులు ప్రాంతీయ సమన్వయకర్త లు ఈ కమిటీలో సభ్యులు అని, ఏయూ లో రెండు ఇంజనీరింగ్ గ్రౌండ్ లోని మొత్తం 29 ఎకరాల్లో ప్రధాని బహిరంగ సభ కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భావి క్రీడా అవసరాలకు తగ్గట్టు బహిరంగ సభ మైదానం సిద్ధం చేస్తున్నామని, ప్రధాని హెలికాప్టర్ కోసం ఏయు ఇంకు బేసిన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ బహిరంగ సభ కు రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని, ప్రధాని ఏ రాష్ట్రానికి వస్తున్నప్పుడు అయా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని, ప్రధాని పర్యటన లో రూ 12 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని, ఇందులో రాజకీయ కోణాలు చూడ కూడదన్నారు ఎంపీ విజయ సాయిరెడ్డి. విశాఖ పరిపాలన రాజధాని అంశం అమలు ఖాయమని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో వైయస్సార్ సీపీ కట్టుబడి వుందని, స్టీల్ కార్మికుల పక్షాన వైయస్సార్ సీపీ వుంటుందన్నారు. వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న ఎంపీ విజయ సాయిరెడ్డి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యత గా వుంటామన్నారు. బీసీ. ఎస్సీ ఎస్టీ వర్గాలను అభివృద్ధి వైసీపీ ఆలోచన అందుకే రాష్ట్ర పతి గా ద్రౌపది ముర్ము కు మద్దతు ఇచ్చామన్నారు.