యూపీలో ఎస్పీకి మరో షాక్… బీజేపీలో చేరిన మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ బంధువు.

-

యూపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మొన్నటి వరకు బీజేపీ నుంచి సమాజ్ వాదీ పార్టీలోకి వలసలు కొనసాగాయి. బీజేపీ నాయకులు, ముగ్గురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఇదిలా ఉంచితే ఏకంగా బీజేపీ ములాయం కుటుంబాన్నే టార్గెట్ చేసింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ కోడలు అపర్ణ యాదవ్ బీజేపీ తీర్థం పుచ్చుకుంది. తాజాగా ములాయం సింగ్ తోడల్లుడు ప్రమోద్ గుప్తా బీజేపీలో చేరారు. ఈయనతో పాటు కాంగ్రెస్ లీడర్ ప్రియాంక మౌర్య బీజేపీలో చేరనుంది.

ప్రమోద్ గుప్తా మాట్లాడుతూ… యూపీలో మాఫియాకు, నేరగాళ్లకు సమాజ్‌వాదీ పార్టీ ఆశ్రయం ఇస్తోందని, అలాంటి పార్టీలో ఉండడం వల్ల ప్రయోజనం లేదని, అఖిలేష్ ములాయం సింగ్ యాదవ్‌ను జైలులో పెట్టారని, నేతాజీ (ములాయం సింగ్), శివపాల్‌లను అఖిలేష్ చిత్రహింసలకు గురిచేశారని ఆయన ఆరోపించారు.

మరికొన్ని రోజుల్లో యూపీలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి. ఆట మీరు స్టార్ట్ చేసినా…ముగింపు మేము ఇస్తాం అన్న రీతిలో బీజేపీ దూసుకెళ్తోంది. ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ కుటుంబాన్నే టార్గెట్ చేసి వారి బంధువులను బీజేపీలోకి చేర్చుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news