మునుగోడులో బిజెపి బహిరంగ సభ రద్దు

-

మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఈ నెల 31న మునుగోడులో బిజెపి భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. అయితే అనూహ్యంగా నేడు ఈ బహిరంగ సభను రద్దు చేసింది బిజెపి. మండలాల వారీగా సభలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది.

మరోవైపు రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో టిఆర్ఎస్ ఆరోపణలపై బీజేపీ హై కమాండ్ ఆగ్రహంగా ఉందని తెలిసింది. ఈ ఆరోపణలను తీవ్ర స్థాయిలో తిప్పి కొట్టాలని రాష్ట్ర నేతలకు హై కమాండ్ సూచించినట్లు సమాచారం. ఈ అంశంలో టిఆర్ఎస్ నేతలు నేరుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడాన్ని ఉపేక్షించవద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది, అవసరమైతే టీఆర్ఎస్ పార్టీతో తాడోపేడో తేల్చుకోవాలని సంకేతాలను ఇచ్చినట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి .

Read more RELATED
Recommended to you

Latest news