ట్యాంక్ బండ్‌కు సరికొత్త అందాలు జతకానున్నాయి. నేడు రాత్రి 7 గంటలకు ఇండియాలోనే లార్జెస్ట్ మ్యూజికల్ ఫాంటెయిన్ లాంచ్ కాబోతుంది. NTR మార్గ్ రోడ్ సైడ్ 180 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో హుస్సేన్నాగర్లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. రూ.17 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మిస్తున్నట్టు ఇదివరకే HMDA ప్రకటించిన సంగతి తెలిసిందే.
టాంక్ బండ్ గా ప్రసిద్ధమైన ఈ రహదారి 1568లో హుస్సేన్ సాగర్ గట్టుగా నిర్మించబడింది. ఇది చెరువు గట్టుగా ఊంది కాబట్టి, టాంక్ బండ్ (చెరువు గట్టు) గా ప్రసిద్ధి చెందింది. హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలను కలుపుతుంది హుస్సేన్ సాగర్ మీద ఉన్న టాంకు బండ్. ఈ గట్టుమీద నుండి వెళ్ళే ట్యాంక్ బండ్ రహదారికి, జంటనగరాలలో ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. పొద్దున్న పూట వ్యాయామంలో భాగంగా ఉదయం నడక సాగించేవారికి, సాయంకాలం వాహ్యాళికి వెళ్ళేవారికి (ముఖ్యంగా ఆదివారం, ఇతర శెలవు రోజుల సాయంత్ర సమయాలలో), స్నేహితులను కలుసుకొనేవారికి, ఇది ఒక ఇష్టమైన ప్రత్యేక స్థలం.