ఆధార్‌ తీసుకొని పదేళ్లయ్యిందా..? అయితే ఈ రూల్ అమలులోకి రావచ్చట చూసుకోండి…!

-

ఆధార్ కార్డు మనకి ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఒకటి. ఆధార్ వలన ఎన్నో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఏదైనా ప్రభుత్వ స్కీమ్స్ నుండి బ్యాంక్ అకౌంట్ వరకు ఎన్నో వాటికి కచ్చితంగా ఆధార్ అవసరం. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఈ ఆధార్ కార్డ్స్ ని జారీ చేస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే ఆధార్ విషయంలో కొత్త రూల్ ని తీసుకు రావాలని UIDAI అనుకుంటోందని తెలుస్తోంది. మరి అదేంటో చూస్తే.. ఆధార్ తీసుకున్న ప్రతీ 10 సంవత్సరాలకు బయోమెట్రిక్ విషయంలో ఓ రూల్ ని తీసుకొచ్చేలా కనపడుతోంది. ఆ రూల్ కనుక ఫైనల్ అయితే ఆధార్‌ కార్డు కోసం ఇచ్చిన బయోమెట్రిక్ డేటాను ప్రజలు ప్రతీ 10 సంవత్సరాలకు అప్డేట్ చేసుకోవాల్సి వుంది.

ఆధార్‌ కార్డ్ ఉన్న వారు స్వచ్ఛందంగా అప్‌డేట్‌ చేసుకోవాలని తెలుస్తోంది. పదేళ్లకొకసారి వేలిముద్రలు, ఫేషియల్, ఐరిష్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 70 సంవత్సరాలవ వయసు దాటితే ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.

అలానే ఇప్పుడైతే ఐదు సంవత్సరాల వయసులోపు పిల్లలకు ఆధార్ కోసం బయోమెట్రిక్‌లను సేకరించడం లేదు కేవలం ఫేషియల్ స్కాన్ మాత్రమే తీసుకుంటోంది. పిల్లలకు ఆధార్ కోసం బయోమెట్రిక్‌లను తీసుకోకుండా తల్లిదండ్రుల బయోమెట్రిక్‌ను తీసుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version