నా భర్త సింహం.. జైలులో ఉంచలేరు : సునీతా కేజ్రీవాల్

-

నా భర్త సింహం.. జైలులో ఉంచలేరు అని సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా పేర్కొన్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త సింహం అని.. ఆయనను జైలులో ఎక్కువ కాలం ఉంచలేరని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో తన భర్త పంపిన సందేశాన్ని ఆమె చదివి వినిపించారు. కేజ్రీవాల్ అనే నేను నాకు ఓటు వేయాలని మిమ్మల్ని కోరడం లేదు. కొత్త ఇండియా కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. భరతమాత బాధలో ఉంది. ప్రతిపక్ష కూటమికీ ఛాన్స్ ఇవ్వండి. కొత్త ఇండియాను నిర్మిస్తాం అని తెలిపారు.

కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడని, నిజాయితీ పరుడని కొనియాడారు. కేజ్రివాల్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ‘నేను మీ నుండి ఓట్లు అడగడం లేదు. ఎన్నికల్లో ఒకరిని ఓడించడానికి సహాయం చేయమని కోరడం లేదు. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మాత్రమే దోహదపడాలని 140 కోట్ల మంది భారతీయులను అడుగుతున్నా’ అని కేజ్రీవాల్ మెసేజ్ ని సునీతా చదివారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version