జనసేన క్రియాశీలక సభ్యుల సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఈ క్రమంలో వైకాపా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించిందని రోజుకు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. ఇసుక, మద్యం, సిమెంట్ ల్లో సంపాదిస్తున్న డబ్బు ఏమవుతోంది? అని ప్రశ్నించిన ఆయన 14 నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చి.. 96 శాతం గెలిచామని వైకాపా నాయకులు చెప్పుకుంటున్నారని, రీనోటిఫికేషన్ ఇచ్చి పోలీస్, వాలంటీర్ వ్యవస్థలను వాడకుంటే గెలిచేవారా? అని ప్రశ్నించారు.
ఒక కులాన్ని లక్ష్యం చేసుకుని మా పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగారని, జనసైనికులు నిలబడి పోరాడి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారని అన్నారు. కాబోయే సీఎంగా పవన్ కల్యాణ్ ను సోము వీర్రాజు సంబోధిచటం పార్టీకి ఉన్న బలం అని అన్నారు. తిరుపతి లో భాజపా పోటీ చేయటం పై కొద్దిమంది జన సైనికుల్లో ఆవేదన ఉందని, రత్న ప్రభ మిగిలిన పార్టీ అభ్యర్థులతో పోల్చితే మెరుగైన అభ్యర్థి అని అన్నారు.