Bangarraju : బంగార్రాజు నుంచి నాగ లక్ష్మి వచ్చేసింది !

-

టాలీవుడ్‌ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా చేసిన… సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఏ రేంజ్‌ లో హిట్‌ అయిందన్న విషయం మనకు తెలిసిందే. అయతే…ప్రస్తుతం అక్కినేని నాగార్జున… బంగార్రాజు సినిమా చేస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమానకు సీక్వెల్‌ గా బంగార్రాజు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయకుడిగా నాగార్జున చేస్తున్నారు. ఈ సినిమా లో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

నాగ్‌ కు జోడీ గా రమ్యకృష్ణ, నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌ తో కలిసి అన్నపూర్ణ స్టూడి యోస్‌ పతాకం పై నాగార్జున నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా నాగ చైతన్య సరసన నటిస్తున్న మరో హీరోయిన్‌ ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. కృతి శెట్టి.. ఈ సినిమాలో నాగ లక్ష్మి పాత్రలో నటిస్తోంది. ఈ మేరకు తాజాగా నాగ లక్ష్మి పోస్టర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ ఫస్ట్‌ లుక్‌ లో పల్లెటూరి అమ్మాయి గెటప్‌ లో కృతి శెట్టి అందరిని అలరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news