పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.పవన్ కళ్యాణ్ చాలా అతిగా మాట్లాడాడు.. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక సినిమాలో హీరో డైలాగులు చెప్పే విధంగా మాట్లాడాడని ఫైర్ అయ్యారు. చాలా బాధాకర విషయం.. సంస్కారహీనంగా మాట్లాడాడు… గుండాలు.. రౌడీలు రాజ్యమేలుతున్నారంట అంటూ నిప్పులు చెరిగారు.
ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీలో నీచుల సమూహం ఎక్కువ అంట…చాలా దారుణమైన విషయం ..కొడుకులు అన్నాడు.. చెప్పుతో కొడతానన్నాడు నేను కూడా పవన్ కళ్యాణ్ అనగలను.. నా కొడకా అని అనగలను కానీ సంస్కారం.. సభ్యత అడ్డం వస్తోందన్నారు. నేను కూడా చెప్పుతో కొడతా అనగలను కానీ మా చిరంజీవి, మా కొణిదల వెంకట్రావు గుర్తుకొస్తున్నారు ఆ ఇద్దరిని చూసి పవన్ కళ్యాణ్ ని ఏమి అనలేకపోతున్నామన్నారు.
నిన్న మాట్లాడిన భాష వాళ్ళ తో తండ్రి కొణిదల వెంకట్రావు పరువును పవన్ పూర్తిగా తీసేశాడు…వెంకట్రావు చాలా గొప్ప వ్యక్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చాలా నిజాయితీగా పని చేశాడు అటువంటి ఆయన కడుపులో పుట్టి ఈరోజు ఈ భాష మాట్లాడాడంటే చాలా బాధాకరమైన విషయం అన్నారు.