తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకింత కక్ష… ఎన్ని లేఖలు రాసినా స్పందనలేదు: నామా నాగేశ్వర్ రావు

-

తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు. నవోదయ విద్యాలయాలపై లోక్ సభ, రాజ్య సభలో ఇచ్చిన నోటిీసులను తిరస్కరించినందుకు సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. దేశం మొత్తం 80 నవోదయ విద్యాలయాలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క నవోదయ విద్యాలయాన్ని కేటాయించలేదని విమర్శించారు. పిల్లలు చదువుకునే నవోదయ విద్యాలయాను కూడా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో లేఖలు రాశారని.. ప్రధాని మోదీని నేరుగా కలిసినా.. ప్రయోజనం లేదని ఆయన అన్నారు. ఎడ్యుకేషన్ లో తెలంగాణ పిల్లలను అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ బిడ్డల ఓట్లతో గెలిచి పార్లమెంట్ కు వచ్చి.. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఎంపీలు ఎందుకు తెలంగాణ సమస్యలపై పార్లమెంట్ లో మాట్లాడటం లేరని ప్రశ్నించారు. తెలంగాణకు నవోదయ విద్యాలయాను ఇవ్వాలని ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. 8 ఏళ్ల నుంచి ఎన్ని ఉత్తరాలు రాసినా కేంద్రం నుంచి స్పందన లేదని ఆయన అన్నారు. ఢిల్లీలో మాట్లాడని బీజేపీ ఎంపీలు గల్లీల్లో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news