ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించిన నందకుమార్

-

తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన భేరసారాల వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ టిఆర్ఎస్ కు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్, తాండూరు ఎమ్మెల్యేలను కొందరు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నందకుమార్ స్పందించారు. పూజల కోసం మాత్రమే తాము ఫామ్ హౌస్ కు వెళ్లామని, ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు తమకు తెలియదని అన్నారు. సింహయాజి స్వామీజీతో సామ్రాజ్యలక్ష్మి పూజ జరిపించడానికి మాత్రమే ఫామ్ హౌస్ కి వెళ్ళామని వివరించారు. మునుగోడు ఉపయోగిమునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఇదంతా చేస్తున్నారని నందకుమార్ ఆరోపించారు. త్వరలోనే మీడియాకు అన్ని వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చెశారు. తాము న్యాయస్థానాన్ని నమ్ముకున్నామను నందకుమార్.. న్యాయస్థానంలో న్యాయమే గెలిచిందని అన్నారు. ఇక ఈ వ్యవహారంపై తెలంగాణ బిజెపి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news