‘ఒకటో నెంబర్ కుర్రాడు’ చిత్రంతో నందమూరి కుటుంబం నుంచి వారసుడిగా నందమూరి తారక రత్న ఇండస్ట్రీలోకి వచ్చారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుని ఇండస్ట్రీలో తారకరత్న దూసుకుపోతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో తారక రత్న..తన పొలిటికల్ ఎంట్రీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ-జనసేన పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉందని నందమూరి తారక రత్న తెలిపారు. 2024లో జనసేన, టీడీపీ పొత్తుల గురించి తారక రత్న తనకు తెలియదని పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లి వాళ్లకు సేవలు చేయాలనే తపన మాత్రమే తనకు ఉందని తారకరత్న తెలిపారు. పొత్తుల గురించి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
పవన్‌ను బాబాయ్ అని సంబోధించారు తారకరత్న. ప్రజల కోసం పవన్ కల్యాణ్ కష్టపడుతున్నారని, ఆయన స్థాయిలో ఆయన పని చేస్తున్నారన్నారు. చిన్నప్పటి నుంచి తాను పవన్ కల్యాణ్ సినిమాలు చూశానని చెప్పారు తారకరత్న. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య పోటీ లాగా తను చూడటం లేదని తారకరత్న తెలిపారు. ఇకపోతే తను, బాబాయ్, తారక్ టీడీపీ కోసం పని చేస్తామని, మామయ్య చంద్రబాబు సూచనల మేరకు అందరం ముందుకు సాగుతామని తారకరత్న చెప్పుకొచ్చారు. జనాలకు మంచి చేయాలనే సదుద్దేశంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని అన్నారు.