ఆర్య సమాజ్ లో పెళ్లిళ్ల పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆర్య సమాజ్ పెళ్లి సర్టిఫికెట్లను గుర్తించబోమని, పెళ్లిళ్లు చేయడం ఆర్య సమాజ్ పని కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కాగా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 5 మరియు7 కు అనుగుణంగా ఆర్యసమాజ్ దేవాలయాలు ఇద్దరు హిందువులు వివాహాన్ని జరుపుకుంటే ప్రత్యేక వివాహ చట్టంలోని నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు.
హిందూ వివాహ చట్టం ప్రత్యేక వివాహ చట్టం కాకుండా ఆర్య వివాహం చట్టం కిందకు వస్తుంది అని హిందూ వివాహ చట్టంలోని నిబంధనల ప్రకారం ఆర్యసమాజ్ వివాహాలు జరపాలని మధ్య ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు గతంలోనే స్టే ఇచ్చింది. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీంతో ప్రేమ వివాహాలు చేసుకొనే వారికి కష్టకాలమే అని చెప్పాలి.