Unstoppable with NBK: బాల‌య్య షోలో సంద‌డి చేయ‌నున్న న్యాచుర‌ల్ స్టార్!

-

Unstoppable with NBK: బాప్ ఆఫ్ ఆల్ షోస్ అంటూ టాలీవుడ్ హీరో నందమూరి బాల‌కృష్ణ.. వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న షో అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. ఈ షో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఇప్ప‌టికే రిలీజైన ఈ షో ప్రోమోతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు బాల‌కృష్ణ‌. ఈ షోకు ప‌లువురు సెల‌బ్రిటీలు అతిథులుగా రానున్నారు. దీంతో కార్యక్రమం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్య బాబు ఎలా ఉంటారు, ఎలా పర్ఫాం చేస్తారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే.. తొలి అథితిగా మంచు మోహ‌న్ బాబు విచ్చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. రెండో గెస్టుగా మెగా బ‌ద్ర‌ర్ నాగ‌బాబు రానున్న‌ట్లు తెలుస్తుంది. ఈ క్ర‌మంలో ఈ షోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది.

ఈ షోలో గెస్టుగా న్యాచుర‌ల్ స్టార్ హీరో నాని కూడా రానున్న‌ట్టు టాక్. ఇప్పుడూ విష‌యం హాట్ టాఫిక్ గా మారింది. అయితే దీనిపై మేక‌ర్స్ నుంచి ఏదైనా అధికారిక‌ప్ర‌క‌ట‌న వ‌స్తే కానీ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక..అన్‌స్టాప‌బుల్ దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 4 నుంచి ఆహాలో ప్రీమియ‌ర్ కానుంది. బాల‌య్య టాక్ షోలో పూరీ జ‌గ‌న్నాథ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెగాస్టార్ చిరంజీవి, రాంచ‌ర‌ణ్, ఇత‌ర సెల‌బ్రిటీలు కూడా ఈ షోలో సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news