నానికి అంత భయమా..ఆ సినిమా చూసి థియేటర్లో ప్యాంట్ తడిపేసుకున్న నేచురల్ స్టార్

-

నేచురల్ స్టార్ నాని..వెండితెరపైన మ్యాజిక్ చేస్తుంటాడు. పక్కింటి అబ్బాయిలాగా కనిపిస్తూ జనాలను ఎంటర్ టైన్ చేస్తుంటారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికి’ ఈ నెల 10న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో నాని ఫుల్ బిజీగా ఉన్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కథానాయికగా నజ్రీయా ఫహద్ నటించారు. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో నాని రామ్ గోపాల్ వర్మ చిత్రం గురించి చెప్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిన్నప్పటి నుంచి తనకు సినిమాలంటే చాలా ఇష్టమని, ప్రతీ సినిమాను థియేటర్ లోనే చూసేవాడనని చెప్పుకొచ్చారు నాని. ఫ్రెండ్స్ తో కలిసి ఒక రోజు రామ్ గోపాల్ వర్మ ‘దెయ్యం’ సినిమాకు వెళ్లినపుడు జరిగిన సంఘటన తెలిపాడు. ఆ ఫిల్మ్ లో సడెన్ గా ఓ సీన్ లో వ్యక్తి అలా వెండితెరపైన కనపడగానే తనకు భయమేసిందని, దాంతో తన చేతిలో ఉన్న కూల్ డ్రింక్ ప్యాంట్ పైన పడిందని, అలా తన ప్యాంట్ తడిసిపోయిందని వివరించాడు.

అయితే, తన ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ ప్యాంట్ మీద పడిందని., ఎంత చెప్పినా నమ్మలేదని తెలిపాడు. తాను సినిమా చూసి భయపడి ప్యాంట్ తడుపుకున్నానని ఏడిపించారని గుర్తు చేసుకున్నాడు నాని. నేచురల్ స్టార్ నాని..తన నెక్స్ట్ ఫిల్మ్ ‘దసరా’లో ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు. పాన్ ఇండియా వైడ్ గా ఈ ఫిల్మ్ రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news