ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎప్పకప్పుడు ట్విటర్ వేదికాగా విరుచుకుపడే నారా లోకేష్ మరో సారి ట్విట్ చేశారు. ‘అప్పుడు.. ఇప్పుడు’ అంటూ జీఎస్‌డీపీ, వ్యవసాయం, రాష్ట్ర బడ్జెట్, సేవలు వంటి రంగాల్లో వృద్ధి, తిరోగమనాన్ని వివరిస్తూ ఉన్న లెక్కలను టీడీపీ నేత నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక్కడే ఆంధ్రప్రదేశ్‌ను ఇలా నాశనం చేశారని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన లెక్కలను ఆయన వివరించారు.
టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి.. జగన్ తొమ్మిది నెలల పాలన ఎలా ఉందో పోల్చి చెప్పారు. టీడీపీ హయాంలో (2014-19) 10.32 శాతంగా ఉన్న జీఎస్‌డీపీ, 10.92 శాతంగా ఉన్న వ్యవసాయ వృద్ధి రేటు ఇప్పుడు పడిపోయిందని పేర్కొన్నారు. కేవలం తొమ్మిది నెలల్లో రాష్ట్ర పరిస్థితి ఘోరంగా తయారయిందని ఆయన పోస్టు చేసిన లెక్కల ద్వారా తెలుస్తోంది. ‘జగన్ ఒక విఫలమైన ముఖ్యమంత్రి’ అంటూ లోకేశ్ విమర్శలు గుప్పించారు.
The “Then & Now” of how Andhra Pradesh is being destroyed single-handedly by @ysjagan #JaganFailedCM pic.twitter.com/juOmJ7efDk
— Lokesh Nara (@naralokesh) February 13, 2020