జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు. పవన్ చెప్పినట్లు ప్రజలు వైసీపీ విముక్త ఏపీ కోరుకోవడం లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా.. చంద్రబాబు, లోకేష్ ల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఇద్దరు అసలు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని అన్నారు మాజీ మంత్రి కురసాల. చంద్రబాబు తన మార్క్ పథకం కనీసం ఒక్కటి చెప్పగలరా అంటూ ప్రశ్నించారు ఆయన చంద్రబాబు ని ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. మాట్లాడుతూ, 175 స్థానాల్లో పోటీ చేస్తానని చంద్రబాబు చెప్పలేకపోతున్నాడు. కేవలం ఎల్లో మీడియా మోసినంత కాలం చంద్రబాబు ఆటలు ఇక్కడ సాగుతాయి. ఏ తరువాత సాగవు. చంద్రబాబు మీడియాను నమ్మితే, సీఎం జగన్ మాత్రం ప్రజలను నమ్ముకున్నారు అని పేర్కొన్నారు కురసాల.
‘‘కాంగ్రెస్ హయాంలో మద్య నిషేధంపై ఈనాడే ఉద్యమం చేయించింది. చంద్రబాబు సీఎం అయిన వెంటనే మద్య నిషేధం ఎత్తివేశారు. దీనికి కర్త, కర్మ రామోజీనే’’ అంటూ చంద్రబాబు పై విరుచుకు పడ్డారు ఆయన. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ప్రజలు మాత్రం అసలు వైఎస్సార్సీపీ విముక్తి ఏపీని కోరుకోవడం లేదు. వైఎస్సార్సీపీ సహిత ఏపీని కోరుకుంటున్నారు. 2019 లో వైఎస్ జగన్ సీఎం ఎప్పటికి కాడని పవన్ వ్యాఖ్యలు చేశారు. కానీ ఏపీ సీఎం జగనే అని ప్రజలు 151 స్ధానాల్లో గెలిపించారు’’ అని వ్యయాలు చేశారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు.